పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు..
తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలని కేఏ పాల్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.. ఈ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.