హారీష్ రావు న్యాయమైన డిమాండ్..!

 హారీష్ రావు న్యాయమైన డిమాండ్..!

Harish Rao’s fair demand..!

Loading

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేముల వాడ ఆలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పాలనలో దేవాలయాల రూపు రేఖలను మార్చాము.దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాము.

తెలంగాణ ఏర్పడకముందు యాదాద్రి ఆలయం ఆదాయం ఎంత.. రాష్ట్రం ఏర్పడినాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసినాక వస్తున్న ఆదాయం ఎంత ఆలోచించండి. ఇప్పుడు రోజూకి యాబై వేల మందికిపైగా భక్తులు వస్తున్నారు. గతంలో దేవాలయాల ఆదాయాన్ని వాడుకున్న ప్రభుత్వాలున్నాయి కానీ ప్రభుత్వ ఆదాయంతో దేవాలయాలను అభివృద్ధి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ . ఏకైక సీఎం కేసీఆర్.రూ. 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసే వెసులుబాటును కల్పించామని బిల్లులో చెప్పారు.సంతోషం..

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు రూ.127 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. కాబట్టి వేములవాడకు కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారు నమ్మి దేవాలయాల అభివృద్ధి చేపట్టారు. యాదాద్రి దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి కృషికి నిదర్శనం.కేసీఆర్ గారు తెలంగాణ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, బాధ్యతతో నిర్మించారు.

యాదాద్రిలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి దేవాలయానికి పెరిగిన భక్తులు, ఆదాయమే సాక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈరోజుకి కూడా జీతాలు పడలేదు.కేసీఆర్ గారి హయాంలో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు పూజారులకు ఇచ్చే వేతనాన్ని రూ. 2000 నుంచి రూ. 10,000 చేశాం.కాంగ్రెస్ వచ్చాక ఆ వేతనాన్ని రూ. 12 వేలకి పెంచుతామని మాట ఇచ్చింది, కానీ గత రెండు నెలల నుంచి ధూపదీప నైవేద్యాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దూప దీప నైవేద్యం కింద 12 వేల రూపాయలు ఇవ్వాలి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *