రేవంత్ సర్కారు కు హారీష్ రావు డెడ్ లైన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్ల రూపాయల అవసరం అవుతుందని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక కేవలం ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేశాము.. పదిహేడు వేలన్నర కోట్ల రూపాయలను బ్యాంకర్లకు అందించాము అని గొప్పలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రుణమాఫీ ఇంకా కాలేదు అని చెబుతాడు..
ముఖ్యమంత్రేమో మొత్తం రుణమాఫీ చేశామని చెబుతుంటరు. రెండు లక్షల రుణమాఫీ అందరికి చేయాలి.. రేషన్ కార్డు లేదని లక్షల మందికి రుణమాఫీ కాలేదు.. రుణమాఫీ కావాలంటే పాస్ బుక్కు అవసరం కానీ రేషన్ కార్డుతో పనేముంది.. రుణం రేషన్ కార్డు చూసి ఇస్తారా..? .. భూమికి సంబంధించి పాస్ బుక్కు చూసి ఇస్తారా కనీసం తెలివి లేని ప్రభుత్వం కాంగ్రెస్ . దసరా లోపు రెండు లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతొక్కర్కి చేయాలి.. లేకపోతే లక్షలాది మంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీమంత్రి హారీశ్ రావు తెలిపారు.