మరో మెట్టు ఎక్కిన హారీష్ రావు ..?
చదవడానికి వింతగా… ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం… కాంగ్రెస్ కు చెందిన మహిళ నాయకురాలు… మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీకి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ రఘునందన్ మంత్రి సురేఖను దేవుడి దగ్గర నుండి తీసుకోచ్చిన ఓ కండువా కప్పి సన్మానిస్తారు.
ఈ ఫోటోను బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో పెట్టి ట్రోలింగ్ చేశారు. దీనిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్స్ కు నేను చింతిస్తున్నాను. మహిళలను గౌరవించడం మన బాధ్యత.. మన తెలంగాణ ప్రజల అభిమతం.. మహిళల పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించిన ఎవరూ సహించరు.. బీఆర్ఎస్ అయిన ఇంకా ఏ పార్టీ అయిన సరే నేను సహించను.. ఇలాంటి చర్యలను ఉపేక్షించను .. కొండా సురేఖకు కలిగిన అసౌకార్యానికి నేను చింతిస్తున్నాను అని తెలిపారు. మాజీ మంత్రి హారీష్ రావు స్పందించిన తీరుపై రాజకీయ విశ్లేషకులు.. విమర్శకులు .. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి కానీ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల గురించి ఏకంగా కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి నుండి డిప్యూటీ సీఎం.. మంత్రులు.. ఎమ్మెల్యేలందరూ పరుష పదజాలంతో దూషించారు.. అంతేకాదు ఏకంగా మార్పింగ్ ఫోటోలతో ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు వికృత చేష్టలకు పాల్పడ్దారు.
అయిన ఇది తప్పు.. ఇలా ప్రవర్తించవద్దు అని కాంగ్రెస్ కు చెందిన ఏ ఒక్క నేత కూడా ఖండించలేదు.. అఖరికి నాడు బీజేపీకి చెందిన నేతలు రాహుల్ గాంధీ,సోనియా గాంధీల గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఒక్క బీఆర్ఎస్ కు చెందిన నేతలు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పా అఖరికి కాంగ్రెస్ కు చెందిన ఏ ఒక్క తెలంగాణ ప్రాంత నేత ఖండించలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కు చెందిన మహిళ నేతపై ఓ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్టును ఖండించడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం తప్పు.. ఇలా ఎవరూ చేయద్దు అని సూచించడం మాజీ మంత్రి హారీష్ రావు వ్యక్తిత్వానికి… ఆయన మంచితనానికి నిదర్శనం.. రాజకీయాల్లో మరో మెట్టు ఎక్కారని రాజకీయ విమర్శకులు.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.