రేవంత్ రెడ్డికి హారీష్ రావు మాస్ కౌంటర్

Harish Rao’s advice to Revanth Reddy..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ తాటి చెట్టంతా ఎత్తున్నాడు.. తాటి గింజ అంత తెలివి లేదు అంటాడు.. ప్రతిసారి నా ఎత్తు గురించి మాట్లాడ్తాడు.
నేను ఎత్తు పెరగడం నాకు దేవుడిచ్చిన వరం.. అదృష్టం.. ఆయన ఎత్తు మూడు అడుగులుంటే నా తప్పా.. నేను తాటి చెట్టు అయితే నువ్వు లిల్లిపూట్ అంత హైట్ ఉన్నావని నేను అనగలను.. మర్రి గింజ అంత తెలివి లేదు అని నేను అనగలను.
కానీ నాకు సంస్కారం.. మర్యాద అడ్డు వస్తుంది. మా నాయకుడు ఎప్పుడు సంస్కార హీనంగా .. అమర్యాదగా మాట్లాడమని. నేర్చుకోమని చెప్పలేదు. నువ్వు ఎత్తు ఎదగకపోతే నాతప్పా..?. ఇక్కడ ఎత్తులు పొత్తులు కాదు రేవంత్ రెడ్డి ముఖ్యం.. జనం గుండెల్లో ఎంత లోతుగా పాతుకుపోయామన్నదే ముఖ్యం.. ఇకనైన నా ఎత్తు గురించి కంటే ప్రజలు మీపై ఎట్టుకున్న హామీల అమలుపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో దృష్టి పెట్టండి అని కౌంటరిచ్చారు.