రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు.
అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను వేలు.. కౌలు రైతులకు పన్నెండు వేలిస్తామని అన్నారు..
రైతుభరోసా ఎగ్గోట్టారు.. పదేండ్ల పాలనలో కేసీఆర్ పదకొండు సార్లు రైతుబంధు డబ్బులిచ్చాడు.. రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారికే చతికిలబడ్డాడు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు.. రైతన్నలకు చేస్తామన్నవి ఎగ్గోట్టారు. ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.