కాంగ్రెస్ పాలనలో ఆగమాగం

Thanneeru Harish Rao Former Minister
వరదలతో ఆగమాగమైన ఖమ్మం జిల్లాలో ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఓ రెవిన్యూ శాఖ మంత్రి.. ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న కానీ వరద బాధితులకు ఇంతవరకూ సాయం అందించలేదు.. వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేదు.. పక్కనే ఉన్న భక్తరామదాసు ప్రాజెక్టు ఉన్న.. సీతారామ ప్రాజెక్టు ఉన్న కానీ రైతులకు ఇంతవరకూ ఎందుకు సాగునీళ్లు ఇవ్వలేదు..
సాగర్ కు గండి పడి ఇరవై ఒక్కరోజులు అవుతున్న కానీ ఎందుకు ఇంతవరకూ పూడ్చలేదు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్న వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం హెలికాప్టర్ తీసుకురాలేకపోయారు.. ఎమ్మెల్యేల బర్త్ డే లకు.. విహార యాత్రలకు హెలికాప్టర్ లుంటాయి కానీ వరద బాధితులను ఆదుకోవడానికి ఉండవా..?.
రుణమాఫీని ఆటకెక్కించారు.. రైతుబీమా ఊసే లేదు. కళ్యాణ లక్షీతో తులం బంగారం అన్నారు.బంగారం మాట భగవంతుడెరుగు ఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వడం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులకు తెగబడుతున్నారు.. ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ డైవర్సన్ పాలిటిక్స్ తప్పా చేసింది ఏమి లేదని ఆయన అన్నారు.