రేవంత్ రెడ్డికి హారీష్ రావు కౌంటర్
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము..
ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను మార్చాము. కళ్యాణ లక్ష్మీ కింద పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాము.. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉంటున్న ప్రగతి భవన్ మేము కట్టించిందే..
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించింది మేమే.. సభలో ఉన్న బయట ఉన్న ఎమ్మెల్యేలు ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టింది మేము..తెలంగాణ రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపిన కాళేశ్వరం కట్టింది మేమే.. 1985లో పునాదులు పడిన ప్రాజెక్టు కల్వకుర్తి,నెట్టెంపాడు ,పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసింది మేమే.. వలసల జిల్లాగా మార్చిన పాలమూరును వలసల వాపస్ జిల్లాగా మార్చింది మేమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్ ఇచ్చారు.