రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు మంగళవారం వేముల వాడలో పర్యటించారు. ఈరోజు ఉదయం వేములవాడ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను వందేండ్లు ముందుకు తీసుకెళ్లారు.
సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కండ్లుగా భావించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారు. రైతుబంధుకు రాం రాం చెప్పారు.
దళితబంధుకు జైభీమ్ చెప్పారు. ఆసరాను అటకెక్కించారు. రైతుభరోసాను బొందపెట్టారు. ఆరు గ్యారంటీలంటూ అన్ని వర్గాలను మోసం చేశారు. 420హామీలంటూ ప్రజలను వంచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే సాగునీటి వ్యవసాయ రంగాలతో పాటు ఏ రంగంపైన అయిన బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.