ఉద్యమ స్ట్రాటజీ – గులాబీ బాస్ మంత్రం ఫలిస్తుందా..?

అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు.
హామీలు అమలు చేయాలని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గులాబీ నేతలు.. కేసుల విషయంలో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ మొన్న సవాల్ విసిరిన కేటీఆర్.. తాజాగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు.
ఏ ఒక్క గ్రామంలోనైనా రేవంత్ సర్కార్ వంద శాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మరి మళ్లీ రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా వేచి చూడాల్సిందే..!!