హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను సీఎం ప్రారంభించారు.
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SKVBR బొటానికల్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కొత్తగూడెం – పాల్వంచ, మరియు సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు.ఫారెస్ట్ – ఎకోటూరిజం అభివృద్ధి కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గార్డెన్ లో 75 వనాలతో కొత్తగా రూపుదిద్దుకున్న వృక్ష పరిచయ క్షేత్రాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీని ప్రారంభించారు.
TGFDC నూతన వాహనాలను ప్రారంభించి బ్యాటరీ వాహనంలో ప్రయాణిస్తూ గార్డెన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ , పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ , మేయర్ గద్వాల విజయలక్ష్మి , అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.