వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

 వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

YSR Congress Party

వైసీపీకి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం రాజీనామా చేశారు. ఈరోజు గుంటూరులో అనుచరులతో జరిగిన కిలారి రోశయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పార్టీకి నష్టం చేసేవారికి మాత్రమే పార్టీలో ప్రమోషన్లు..గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. పార్టీ పెద్దలు నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయడం కంటే నేతలంతా తమకు తాము బలపడటానికి కృషి చేసుకున్నారు.. మంచి చేద్దామని ఎవరూ ప్రయత్నించిన కానీ ఇలా అవమానాలకు వేదనకు గురి చేశారు. అందుకే ఇలాంటి పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానని” ఆయన తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *