సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి .. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.
మేము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ ముప్పై ఆరు లక్షల మంది రైతన్నలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కి పద్ది ఎనిమిది వేల కోట్లు ఎలా సరిపోయాయి.? .. రైతులను మాయ చేసి మాటలతో మభ్యపెడుతున్నారు. రైతు రుణమాఫీ కాక రైతులందరూ రోడ్లపై బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా వందకు వందశాతం రుణమాఫీ జరిగితే నువ్వు ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ లోనైన.. నువ్వు పుట్టి పెరిగిన కొండారెడ్డిపల్లిలోనైన రైతులను అడుగుదాము…
వందకు వందశాతం రుణమాఫీ అయిందని చెబితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను.. నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని బహిరంగ సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు. తన తమ్ముళ్ల బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకోవడం కోసం.. కంపెనీలు వస్తే పెట్టుబడులు వస్తే ఆయా కంపెనీలు ముందుకు వచ్చి ప్రకటిస్తాయి కానీ హోర్డింగ్స్ లోనూ పేపర్ యాడ్స్ లోనూ కన్పించవు అని మాజీ మంత్రి కేటీఆర్ హెద్దేవా చేశారు..