రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు- హారీష్ రావు కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు.
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం లేదు.. రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ లేదు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు లేవు.. రైతుభరోసా లేదు.. రైతుభీమా లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలపునాదులతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నరు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మొదటిరోజునే ఆసరా పించన్ నాలుగు వేలు ఇస్తామనే ఫైల్ పై సంతకం చేశారు. ఇస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పించన్ వెయ్యి ఇస్తామని చెప్పాము. ఇచ్చాము. మళ్లీ అధికారంలోకి వస్తే రెండు వేలు ఇస్తామని చెప్పాము.. ఇచ్చాము.. మేము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాము. మా నాయకుడు కేసీఆర్ మాట ఇస్తే మడెమ తిప్పడు. కానీ రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు అని కౌంటరిచ్చారు.