జాతిపిత కేసీఆర్.. బూతుల పిత రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల పిత అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ పద్నాలుగేండ్ల స్వరాష్ట్ర సాధనకై కొట్లాడాడు..
చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల చిరకాల వాంఛను నెరవేర్చారు. ఆ అతర్వాత పదేండ్ల పాలనలో ఆసరా, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం, రైతుబంధు, రైతుభరోసా, కేసీఆర్ కిట్లు, సర్కారు దవఖానాలు, మెడికల్ కాలేజీలు ఇలా ఆరు వందలకు పైగా సంక్షేమాభివృద్ధి పథకాలతో దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దారు..
పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపి తెలంగాణ జాతిపితగా కేసీఆర్ నిలిచారు. కానీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైన కానీ ఒక్క హామీని నెరవేర్చలేదు.. ఆరుగ్యారంటీలల్లో ఒక్కటి అడ్రస్ లేదు. నిత్యం బీఆర్ఎస్.. కేసీఆర్ పై బూతులు మాట్లాడుతూ ప్రజల దృష్టిలో బూతుల పితగా నిలిచారు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండి గల్లీలో గోలీలు ఆడుకునే పొరడి కంటే హీనంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అని హెద్దేవా చేశారు. ఇప్పటికైన రేవంత్ రెడ్డి తన భాషను తీరును మార్చుకోవాలని హారీష్ రావు సూచించారు.