కాంగ్రెస్ పాలనపై రైతన్నలు కన్నెర్ర

 కాంగ్రెస్ పాలనపై రైతన్నలు కన్నెర్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే…

వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు.

ఈ నేపథ్యంలో రైతులను గోసపుచ్చుకుంటున్న సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ గులాబీ సైనికులకు పిలుపునిచ్చారు.

రైతుల పక్షాన నిలబడాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులను కోరారు. రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతోపాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని సూచించారు. రైతుల హకులను కాపాడేందుకు, వారికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికలు ముగిసీ ముగియగానే బోనస్‌పై నాలుక మర్లేసిన కాంగ్రెస్‌పై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ ముగిసిన తెల్లారే వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకే బోనస్‌ అంటూ చేసిన ప్రకటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్టు చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *