మాజీ మంత్రి హారీష్ రావు “లాజిక్ కరెక్టే” కదా..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు.
తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఉందని మరికొంతమందికి.. ఇంట్లో కొడుకు సర్కారు నౌకరి ఉందని ఇంకొంతమందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. ఇంట్లో కొడుకుంటే సర్కారు నౌకరి వస్తాది. వస్తే కొడుకు అమ్మనాన్నతో ఉంటడా.. ? రైతు అనేవాడ్కి కొడుకుంటే అతనికి సర్కారు నౌకరి ఉండకూడదా..?. ఎన్నికలకు ముందు 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది.
మిగతా 21 లక్షల మంది రైతులు కాదా అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలు మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తే ఏదోక అంశం కొర్రి పెట్టీ రుణమాఫీ అపేశారు. మొదటి విడత,రెండో విడత రుణమాఫీల జాబితాలను గ్రామాలకు ఇచ్చారు.. మూడో జాబితా మాత్రం బ్యాంకర్లకు ఇచ్చారు. రుణమాఫీ కట్ చేశారు.. రైతుబంధును అటకెక్కించారు.. రైతుభీమాను అడ్రస్ లేకుండా చేశారు. కాంగ్రెస్ అంటేనే కటింగ్ ప్రభుత్వం అని మరోకసారి నిరూపించారు అని ఆయన హెద్దేవా చేశారు.