బుల్డోజర్ కు అడ్డంగా మాజీ మంత్రి హారీష్ రావు..?
తెలంగాణ లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ గుర్తు హాస్తం కు బదులు బుల్డోజర్ ను పెట్టుకోవాలి.. సరిగ్గా రెండోందల ఏండ్ల కిందట వరదలోచ్చిన కానీ నాటి నిజాం రాజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూల్చలేదు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి అని బడా బాబుల ఇండ్లను వదిలేసి.. పేదవాళ్ల ఇండ్లను కూల్చి వేస్తున్నారు.
అసలు ఈ ఇండ్ల నిర్మాణాలకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.. కొడంగల్ లో సర్వే నంబరు 30లో ఉన్న రెడ్డీ కుంట చెరువులో నిర్మించుకున్న నీ ఇల్లును కూల్చుకునే దమ్ము ఉందా..?. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నీ సోదరుడి ఇల్లును కూల్చేస్తావా అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
ఈ రోజు హైదర్ కోటలోని హైడ్రా బాధితులను మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా హైడ్రా బుల్డోజర్లు మీ ఇండ్లను తాకాలంటే ముందు మమ్మల్ని ఎత్తాలి… మమ్మల్ని తాకి మీ ఇండ్ల జోలికి రావాలని ఆయన బాధితులకు భరోసానిచ్చారు.