రేవంత్ రెడ్డికి ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యం..!

Revanth Reddy Anumula
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో పదేండ్ల వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకుంటే..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాణాల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమంటూ ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి వీస్తోంది. బీజేపీని రేవంత్ పల్లెత్తు మాట అనడు అని ఆయన అన్నారు.
