అనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి

Revanth’s sensational comments on Congress leaders
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు నిరసన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఆసరా నాలుగు వేలు అన్నాడు ఎగరవేశాడు. రైతుభరోసా పదివేలు కాదు పదిహేను వేలు అన్నాడు. అది ఎగరవేశాడు. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు. అది ఎగరవేశాడు. మహిళలకు నెలకు రూ.2500లు అన్నాడు. అది ఎగరవేశాడు.
ఆడపిల్లలకు స్కూటీలన్నాడు. అది ఎగరేవేశాడు. రైతుకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు. అది ఎగరవేశాడు. ఫ్రీ కరెంటు అన్నాడు. అది ఎగరేశాడు. ఆరు గ్యారంటీలతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన 420హమీలను ఎగరేశాడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
