కొండా సురేఖ కామెంట్స్ దుమారం – కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…!

Konda Surekha
హీరోయిన్ సమంత .. అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఎలాంటి ఆధారాల్లేకుండా.. సత్యదూర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో ఇంట బయట(ఢిల్లీ పెద్దల దగ్గర) తీవ్ర అసంతృప్తిని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వ్యతిరేకత మూటకట్టుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులతో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలను ముఖ్యమంత్రి అండ్ బ్యాచ్ ఎంత అవమానించిన.. నిందించిన.. ఆరోపణలు చేసిన కానీ వాటిని తెలంగాణ ప్రజలతో పాటు అన్ని వర్గాలవాళ్లు రాజకీయ కోణంలో చూస్తారు. ఇది ఎవరూ కాదనలేని నగ్నసత్యం. ఇటీవల ఎన్నికలైన దగ్గర నుండి అధికార పార్టీ శ్రేణులు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఎన్ని ఆరోపణలు చేసిన అఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు వృధా .. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా చేశారని ఆరోపించిన కానీ తెలంగాణ సమాజం అంతగా పట్టించుకోలేదు.. వీటీని రాజకీయ కోణంలోనే చూసింది కూడా.
కానీ హైడ్రాతో పెరుగుతున్న వ్యతిరేకతను.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడానికి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకు అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని సినీ ప్రముఖులను ఈ వివాదంలోకి గుంజడం… ఓ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. మంత్రి సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది అని ఏకంగా ఆ పార్టీ అధికార ప్రతినిదే టీవీ డిబెట్లో వెల్లడించడం ఇది ఎంత ప్రభావం చూపిందో ఆర్ధమవుతుంది.
తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారు తప్పా క్షమాపణలు చెప్పకపోవడం కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలినట్లైంది. ఆడవారి రాజ్యాలు కూలిపోతాయని అందరూ అంటరు కానీ ఓ మహిళ అయి అందులో మంత్రిగా ఉండి సాటి మహిళ గురించి వెనక ముందు ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు . మంత్రిని డిపెండ్ చేయాలని ఆ పార్టీకి చెందిన మహిళ నేతలు మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం .. ధర్నాలు చేయడం కూడా ఆ పార్టీపై ఇంకా వ్యతిరేకతను మూటకట్టుకునేలా చేస్తుంది. మంత్రి సురేఖ చేత క్షమాపణలు చెప్పించి ఆ పార్టీ నేతలు కేటీఆర్ పై కొట్లాడితే ఫలితం ఉంటుంది తప్పా ఇలా చేస్తే చివరికి ఆ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది.
