సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ము లేదా…?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి పేదవాళ్ల కట్టడాలు.. నివాసాలు కూల్చే దమ్ము ఉంది . బడా బాబుల నివాసాలు.. వాళ్లకు సంబంధించిన వ్యాపార భవంతులను కూల్చే దమ్ము లేదా..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేదవాళ్లపై అక్కసు ఉందా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారా..?. ప్రజాపాలన అంటూ.. మార్పు తేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులను హైడ్రా పేరుతో వేధిస్తున్నారా..?.
ఎన్నికల హామీలను సైడ్ ట్రాక్ పెట్టడానికే హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్.. హైడ్రా బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా పేరుతో కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు. హైడ్రా రూల్స్ పేదవాళ్లకు ఒకలా… బడా బాబులకు ఇంకొకలా ఉంటాయా..?. దుర్గం చెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో తన సోదరుడు ఉంటున్న నివాసాలను కూల్చడానికి టైం ఇస్తారు..
కానీ పేదవాళ్లకు.. సామాన్యులకు మాత్రం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వరా..?. ట్యాంక్ బండ్ అంటేనే చెరువు. మరి దాని పరిధిలో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్, ప్యారడైజ్ లాంటి నిర్మాణాలను కూల్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా…?. హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులన్నీ అక్రమణలకు గురయ్యాయి.. వాటిన్నంటిని కూల్చే దమ్ము ఉందా అని ఆయన ప్రశ్నించారు.