దమ్ముంటే దా- రేవంత్ కు హారీష్ సవాల్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి అని చెబుతున్నావు కదా.. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా.. గన్ లేకుండా నువ్వు పుట్టిన పాలమూరు జిల్లాలోనే బోయిన్ గుట్ట తండాకు రుణమాఫీపై చర్చకు రా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హారీష్ రావు సవాల్ విసిరారు.
కల్వకుర్తిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీరు నిజంగా రుణమాఫీ చేస్తే.. మీకు పౌరుషం ఉంటే దమ్ముంటే చర్చకు రావాలి అని ఆయన సవాల్ విసిరారు.
మాజీ మంత్రి హారీష్ ఇంకా మాట్లాడుతూ ” కేసీఆర్ సీఎం గా ఉన్న పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర జీడీపీ పెంచారు. రేవంత్ రెడ్డి పదిహేను నెలల సీఎంగా ఉండి గుండాయిజం పెంచారు. నాడు రెండోందల పింఛన్ ను రెండు వేల పించన్ చేసి కేసీఆర్ అందిస్తే పదిహేను నెలల్లో రెండు నెలల పింఛన్ ను ఎగ్గోట్టిన సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
