ఏ క్షణమైన మాజీ మంత్రి రోజా అరెస్ట్..!

ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ అవుతారా..?. ఐదేండ్ల వైసీపీ పాలనలో మంత్రిగా రోజా అనేక అవినీతి అక్రమాలు చేశారా ..?. అంటే అవుననే అంటున్నారు ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు .
మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారు.క్రీడా సామాగ్రి సంబంధిత కొనుగోళ్ల విషయంలో మొత్తం 119కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు అని ఆయన ఆరోపించారు.
తాను ప్రాతినిధ్యం వహించిన నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంది. తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని మాజీ మంత్రి రోజా భయపడుతున్నారు. ఏదోక రోజు ఆ అవినీతి బయటకు రావడం ఖాయం. రోజా ఏ క్షణమైన అరెస్ట్ కావడం పక్కా అని ఆయన అన్నారు.
