దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?

KTR’s call to the people of Hyderabad..!
తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు.
కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకొచ్చి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.సభలో తాము ప్రశ్నిస్తేనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటకొచ్చి ప్రకటనలు చేశారని కేటీఆర్ అన్నారు. రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహరాలకు వ్యతిరేకమని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క మరిచిపోయారని విమర్శించారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన భట్టి విక్రమార్క.. శాసన సభ బయట ప్రకటన చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ ప్రకటన చేస్తే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదని.. అందుకే ఇలా బయట ప్రకటన చేశారని విమర్శించారు.
