కేటీఆర్ పై కేసుతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్..!
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫార్ములా – ఈ కార్ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసిబీ కేస్ నమోదు చేసి కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.పార్ములా – ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ వచ్చిందని ఒకవైపు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాదిస్తుంది. అనేక వర్గాలు సైతం దీనితో ఏకీభవిస్తున్నారు.
అయితే ఇందులో డబ్బులు నేరుగా పంపారంటూ ఆరోపణలనేపద్యంలో కేసు నమోదు చేసారు.మరి ఈ కేసు నిలుస్తుందా అంటే నిలవకపోవచ్చు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదు.. కేవలం క్యాబినెట్ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వకుండా నిధులను ఓ విదేశీ కంపెనీకి తరలించారు. అందుకే కేసు నమోదు చేశాము అని ఆయన చెప్పకనే చెప్పారు ఈ కేసు సైతం నిలవదు అని.అందుకే అధికార పక్షం డిపెన్స్ లో పడింది.తప్పు చేయలేదు తగ్గేదే లే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు… అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిపి ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ పట్టిబడుతుండటంతో కాంగ్రెస్ డిపెన్స్ లో పడింది.
అనవసరంగా ఈ అంశంలో కేటీఆర్ పై కేసు పెట్టామని,ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి,వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైంది కాంగ్రేస్ పరిస్థితి.అంత ప్రాధాన్యత లేని అంశంపై కేటీఆర్ ను ఇరికించి కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్టు గుస గుస.ఒక రకంగా ఈ అంశం కాంగ్రేస్ కు ప్లస్ అవుతుందా..?లేక ఆ పాచిక పారక కాంగ్రెస్ మెడకే చిక్కుకుంటుందా వేచి చూడాల్సిందే మరి..!