రేవంత్ తీరుపై కాంగ్రెస్ నేతలు అసహానం..?

 రేవంత్ తీరుపై కాంగ్రెస్ నేతలు అసహానం..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి చేర్చుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది..

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని అక్కడున్న స్థానిక నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. తాము పదేండ్లు ఎవరిపైన అయితే కొట్లాడామో.. వారి అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేసి కేసుల పాలయ్యామో మాకు తెలియకుండా ఎలా చేర్చుకుంటారని నిరసన గళం విన్పిస్తున్నారు.. మరోవైపు జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత..ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి అయితే ఏకంగా తన పార్టీ సభ్యత్వానికి …ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు..

దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లాంటి సీనియర్ నేతలు వెళ్లి బుజ్జగించిన కానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు.. ఎన్నికల సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్ధు చేసేలా చట్టం తీసుకువస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా చేర్చుకుంటారు అని ఎదురు ప్రశ్నిస్తూ విమర్శల పర్వం కురిపిస్తున్నారు ..

https://www.singidi.com/jeevan-reddy-kantatadi/

పార్టీలోని సీనియర్ నేతలను సంప్రదించకుండా..స్థానిక నేతలకి కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా చేర్చుకుంటారని వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ వర్గాల నుండి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది..చూడాలి మరి మున్ముందు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తోన్న తీరు ఇంకా ఎన్ని తిప్పలు తెచ్చిపెడ్తాయో..ఇంకా ఎంతమంది నేతల అసంతృప్తులకు కారణం అవుతాడో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *