తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్
నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి ఆ పార్టీ కి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావులు వరుస పెట్టి మరి ప్రెస్మీట్లు పెడుతున్నారు.
పెట్టి మరి ఆ ఫామ్ హౌజ్ మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ధిది.. అందులో డ్రగ్స్ పార్టీలు.. రేవ్ పార్టీలు జరిగాయని డిసైడ్ చేస్తున్నారు. ఆ పార్టీ ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ కన్నుసైగల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు శనివారం వీకెండ్ దావత్ లు జరగడం.. వాటిని మాజీ మంత్రి కేటీఆర్ కు అంటగట్టడం.. కేటీఆరే దగ్గర ఉండి చేయించారని ఆరోపించడం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై.తాజా హైడ్రా,మూసీ నది పరివాహక ప్రాంత ప్రజల సమస్యలపై తెలంగాణ సమాజం దృష్టిని మరలించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అందుకే గత పది నెలలుగా యువత, రైతాంగం, మహిళలు, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత ర్యాలీ ధర్నాలు,గురుకుల ఉపాధ్యాయుల ధర్నాలు, తాజాగా ఆశోక్ నగర్ లో గ్రూప్ వన్ పరీక్షల అభ్యర్థుల, బెటాలియన్ పోలీసుల నిరసన కార్యక్రమాలపై ఇంతవరకూ ఇటీవల అధికార పార్టీ కానీ అటు బీజేపీ పార్టీకి చెందిన నేతలు కానీ స్పందించలేదు. కేవలం నామ్ కే వాస్త్ లెక్క స్పందించారని అంటున్నారు.