తెలంగాణలో ఉద్యమ నాటి పరిస్థితులు
తెలంగాణలో ప్రస్తుతం నాడు ఉద్యమంలో నెలకొన్న పరిస్థితులు నేడు చూస్తున్నాము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ రాధాకృష్ణన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో కల్సి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము.. పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పుడు మాట తప్పి రాజ్యాంగాన్ని అవమానిస్తుంది. రాష్ట్రలో నిరుద్యోగుల బాధలను సమస్యలను పట్టించుకోకుండా.. పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.
ప్రోటోకాల్ వివాదం గురించి చర్యలు తీసుకోవాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను వేదికలపైకి.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్రజాస్వామికంగా నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు.. అరెస్టులు చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు.
గవర్నర్ ను కల్సినవారిలో మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,వేముల ప్రశాంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు ఉన్నారు.