హద్దులు దాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy is a joker.. a paper tiger..!
ఆయనో ముఖ్యమంత్రి.. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాడు. అయిన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అలానే ఉన్నాడు. అదే వాక్ చాతుర్యం.. అదే శైలీ.. ఏ మాత్రం తీరు మార్చుకోకుండా నోటికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడిన నడుస్తుంది. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని నియమనిబంధనలు ఉన్నాయనే సంగతి మరిచినట్లు వ్యవహరిస్తున్నాడు. ఇంతకూ ఎవరిగురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.. ఇంకా ఎవరి గురించి మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి గురించే.
ప్రతిపక్షంలో పీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుండి మాజీ మంత్రులు కేటీఆర్.. హారీష్ రావు.. బీఆర్ఎస్ నేతలను అందర్ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. తన మాటలతో చేష్టలతో సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలను హీట్ ఎక్కించాడు. ఒకానోక సమయంలో కేసీఆర్ ను అయితే బొందపెడతా అనే స్థాయిలో మాటలు జారారు.. ఫామ్ హౌజ్ లో పంటాడు. తాగుబోతు సీఎం ఇలా అనరాని మాటలు.. చెప్పలేనివిధంగా విమర్శించారు. అయిన ప్రజలు వాటిని స్వీకరించారు.. మద్ధతు ఇచ్చినట్లుగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు.
గత ఏడాదిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుండి సామాన్య బీఆర్ఎస్ కార్యకర్త వరకు అందర్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. గతంలో పేగులు మేడలో వేసుకుంటాను. లాగుల్లో తొండలు పెట్టిస్తాను. బీఆర్ఎస్సోళ్లను ఉరికిచ్చి కొడతారు మా కార్యకర్తలు అని ఇలా ఓ సీఎం ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన ఎస్సీ వర్గీకరణ.. బీసీ కులగణన పై చర్చలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ గురించి కూడా అసెంబ్లీ సాక్షిగా నోరు జారారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నాడు. ఎందుకు వస్తాయి. కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడా..?. సిరిసిల్ల లో ఉప ఎన్నికలు వస్తున్నాయా అని విమర్శించారు. ముఖ్యమంత్రి అంటే ఇంటికి యజమాని లెక్క రాష్ట్రానికి తండ్రిలాంటి వాడు. అలాంటి పోజిషన్ లో ఉండి ప్రతిపక్ష నాయకుడి చావును కోరుకోవడం ఎంత వరకు కరెక్ట్.. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులకు కాకపోయిన తానున్న ఆ పదవికి గౌరవం ఇవ్వాలి.. ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహారించాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ప్రతిపక్ష ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా విమర్శించడం.. టార్గెట్ చేయడం హద్దులు మీరడమే అని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైన సరే తన పదవికి తాను ఉన్న స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి.. వ్యవహారించాలని వారు సూచిస్తున్నారు.
