రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో శుభవార్తను తెలిపారు. ఈరోజు గురువారం గోల్కోండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం.. ప్రజల చేత.. ప్రజల కోరకు ఏర్పాటైన ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తాము.. ఆరు గ్యారంటీలను అమలు జేసి తీరుతాము.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కానీ రైతాంగం ఇబ్బంది పడకూడదని రెండు లక్షల రుణమాఫీ చేశాము.. రైతుబంధు పథకాన్ని రైతుభరోసా పేరుతో త్వరలోనే అమలు చేసి తీరుతామని” ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ ” అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాను. తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చేందుకు వారు ముందుకు వచ్చారు. గత ప్రభుత్వం మాదిరి అధిక వడ్డీలకు రుణాలను తెచ్చి ప్రజలపై నెట్టము అని” అన్నారు.