తెలంగాణలో ఉపఎన్నికలు
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించేవరకు నిద్రపోము అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈరోజు పఠాన్ చెరు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారుతున్నారు. పార్టీకి బలం కార్యకర్తలు.మనకు అరవై లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏమి తక్కువ చేశాము .మూడు సార్లు ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చి నియోజకవర్గంలో ప్రతి గడపకు తిరుగుతూ గెలిపించుకున్నాము.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం.. అవసరమైతే సుప్రీం కోర్టులో పోరాడుతాము.. నాడు వైఎస్సార్ ఇలాగే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కార్యకర్తలకు నేను అండగా ఉంటాను అని ఆయన అన్నారు..