హారీశ్ రావు దిష్టి బొమ్మ దహనం.

Burning of Harish Rao’s effigy.
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు దిష్టి బొమ్మను తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు, నేతలు దహనం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కు వ్యతిరేకంగా జాగృతి నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో బీఆర్ఎస్ లో ఇరువర్గాలుగా విడిపోయి ఇటు ఎమ్మెల్సీ కవితకు, అటు మాజీ మంత్రి హరీశ్ రావుకు మద్ధతుగా సోషల్ మీడియాలో ఓ వార్ నే నడుపుతున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లేక్సీల్లో, బొమ్మల్లో కవిత ఫోటోను తీసేస్తున్నారు.