బీఆర్ఎస్ కీలక నిర్ణయం..!

KCR
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల పద్నాలుగో తారీఖున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులతో గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులు, బహిరంగ సభ తదితర అంశాల గురించి సుధీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ ” ఈనెల పద్నాలుగున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నాము. ఈనెల 14,15,16,17 తారీఖుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నాము. తదుపరి తేదీలను త్వరలోనే వెల్లడిస్తాము. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలపై తప్పకుండా ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో కొట్లాడుతాం అని మరోసారి మాజీ మంత్రి గంగుల పునరుద్ఘాటించారు.