ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు..
తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జెడ్పి చైర్మన్,ఎంపీ అభ్యర్థి మారేపెల్లి సుధీర్ కుమార్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గారికి వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న 15 వేల పట్టభద్రులను బిఆర్ఎస్ శ్రేణులు వారిని ప్రత్యక్షంగా కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు.బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని గమనించాలని ఓటర్లను అన్నారు.కాంగ్రెస్ బోగస్ హామీలను, మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రతి క్లష్టర్ లో ఉన్న గ్రామాలకు ఆ గ్రామాల్లో ఉన్న వారిని భాద్యులను చేస్తూ ఇంచార్జిలను నియమించాలన్నారు.ప్రతి ఓటరును కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు.పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని అన్నారు.