బీఆర్ఎస్ SM ను చూసి వణుకుతున్న కాంగ్రెస్

BRS vs Congress in Social Media
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఏ చిన్న అంశాన్ని వదలిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఇటు ఫేస్ బుక్ అటు ట్విట్టర్ లో బీఆర్ఎస్ నెటిజన్లు..
సానుభూతిపరులు, అభిమానులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం యొక్క లోపాలను తెలియజేస్తూ తమదైన పంథాలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆసరా దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు.. రైతుబంధు దగ్గర నుండి రెండు లక్షల ఉద్యోగాల వరకు.. రైతుల ధర్నా నుండి నిన్నటి బెటాలియన్ పోలీసుల ధర్నా వరకు అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమందిపై కేసులు పెట్టడం.. అరెస్టులు చేయడం జరుగుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ” బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం లెక్క మారింది.
నా గురించి. ముఖ్యమంత్రి గురించి.. ప్రభుత్వంపై ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కర్ని పంజాగుట్ట సర్కిల్ లో బట్టలూడదీసి కొడతాను అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ పై ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారక హ్యాండిల్ లోనే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో హీరో విలన్ ను చూసి ఏమి ఈక్కోంటవు ఈక్కో .. కెమెరామ్యాన్ గంగ తో రాంబాబులో పీకే చెప్పే తప్పు చేస్తే సీఎం అయిన ఒకే .. పీఎం అయిన ఒకే .. డైలాగ్స్ తో కూడిన వీడియోలను వైరల్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి అధికార పార్టీ వణుకుతుందని పోస్టులు పెట్టడం గమనార్హం..
మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వే అంటూ జగ్గారెడ్డి పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అది రాజకీయమైన సోషల్ మీడియా అయిన అఖరికి వ్యక్తిగతమైన ఒకర్ని కించపరచనంతవరకు సెటైర్లైన.. విమర్శలైన.. ట్రోల్స్ అయిన ఒకే .. కానీ శృతి మించితేనే ఎవరికైన నష్టం.. అధికార అధికార పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ అయిన అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
