కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహర్ జైళ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మంగళవారం దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టీస్ గోవాయ్ బీఆర్, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది.
ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు,కవిత భర్త అనిల్,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు భారీ ఎత్తున సుప్రీం కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈరోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.