నిన్న మంగళవారం జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వూ ముగించుకుని బయటకు వచ్చిన హుజూర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి దిగిన ఘటనలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన రిమాండ్ రీపోర్టును జడ్జి కొట్టేశారు.ఈ రోజు ఉదయం ఆయనకు […]Read More
Tags :bail
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే.. ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు […]Read More
మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ బెయిల్ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని బెయిల్ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్ ఎంఓయూ: వైయస్సార్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు […]Read More
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బైయిల్ పై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత నిన్న మంగళవారం విడుదల అయిన సంగతి తెల్సిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్లను ఆ పార్టీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ […]Read More
న్యాయం గెలిచింది..!ప్రజాస్వామ్యం మురిసింది..!- ఎడిటోరియల్ కాలమ్..!!
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్నే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక ఊపు ఊపిన ఉదాంతం.ఈ స్కాంలో సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు అందరిపై ఈడీ సీబీఐ అభియోగాలు మోపి అందర్ని నిందితులంటూ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. దాదాపు ఆరేడు నెలలుగా సినిమాట్రిక్ గా ఓ పెద్ద డ్రామానే నడిచింది. ఒకపక్క ఆ […]Read More
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ,సీబీఐ నమోదు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. పది లక్షల విలువైన రెండు ష్యూరీటీలతో సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కవితకు సంబంధించిన పాస్ పోర్టును సరెండర్ చేయాలి.. సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదనే కండీషన్స్ విధించింది. దీంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవిత తరపున న్యాయవాది మోహీత్ రావు ష్యూరీటీ పేపర్లను.. బెయిల్ కాపీ జైలు అధికారులకు […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహర్ జైళ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మంగళవారం దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టీస్ గోవాయ్ బీఆర్, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు,కవిత భర్త […]Read More