మాజీ మంత్రి హారీష్ రావు బాటలో BJP MLA
తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే.
తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో బీజేపీ ఎమ్మెల్యే..బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వందకు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను.. రుణమాఫీ నిజం కాకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు..
రుణమాఫీపై రైతుల సమక్షంలోనే చర్చకు కూర్చుందాము.. రైతులతోనే మాట్లాడిద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రూ.49వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు.