జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు.
విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ కూడా రాయలేదు..ఈ పార్టీలో ఫారిన్ మద్యం ఉండటం, పార్టీకి పర్మిషన్ లేదు అనే కారణాలు మాత్రమే చెప్పారు… దానికి ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.కానీ కావాలని బీజేపీ కాంగ్రెస్ కు చెందిన నేతలు ఈ ఫామ్ హౌజ్ మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ధిది.. కేటీఆరే ఆ పార్టీ నడుపుకోమని చెప్పారు.
డ్రగ్స్ వాడారు. అది రేవ్ పార్టీనా.. రావుల పార్టీనా.. కేటీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు బీజేపీ నేతలు ఆరోపించడం పై బీఆర్ఎస్ శ్రేణులు ,మేధావులు,నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాంటి డ్రగ్స్ అనవాళ్లు లేకపోయిన కానీ డ్రగ్స్ ఉన్నాయి.. కేటీఆర్ & బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేకపోయిన వారికి అంటగట్టడంలో అత్యుత్సాహాం చూపిస్తున్నారు అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.