మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్..!

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్..!

Loading

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గమైన పాలేరులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయ పాలెం మండలం పరిధిలో జల్లెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు భారీగా గులాబీ కండువా కప్పుకున్నారు.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధినేత .. ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో దాదాపు రెండోందల మంది కార్యకర్తలు.. పలువురు నేతలు కారు ఎక్కారు. వీరందరికీ గులాబీ అధ్యక్షుడు తాతా మధు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు మాట్లాడుతూ ” పార్టీ అధికారంలోకి రావడం కోసం పదేండ్ల పాటు కష్టపడ్డాము.

తీరా అధికారంలోకి వచ్చాక పార్టీలో మొదటి నుండి ఉన్నవాళ్లకు అన్యాయం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా మేము కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పథకాల ఫలాలు ప్రజలకే కాదు సొంత పార్టీ వాళ్లకు కూడా అందటం లేదు. పార్టీలో ఉండి అవమాన పాలై బదులు బీఆర్ఎస్ లో చేరి ప్రజల పక్షాన పోరాడటం మంచిదని చేరామని తెలిపారు.

ఆ తర్వాత తాతా మధు మాట్లాడుతూ ” మార్పు మార్పు అంటూ ప్రజలను జీవితంలో హాస్తం గుర్తుకు ఓట్లేసే పరిస్థితి లేకుండా మార్పును చూపించారు. ఆసరాను ఆటకెక్కించారు. రైతు బంధుకు రాం రాం చెప్పారు. కళ్యాణ లక్ష్మీకి కాళ్లే లేకుండా చేశారు. కేసీఆర్ కిట్ల అడ్రస్ లేకుండా చేశారు. రుణమాఫీపై ఊసే లేదు . నాలుగు ఏండ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ బీఆర్ఎస్సే వస్తుంది. మళ్లీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆయన భరోసానిచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *