మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ముందు నుండి దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బిగ్ షాకిచ్చారు.
ఫార్ములా ఈ కారు రేస్ నిధుల వ్యవహారంలో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2),409,120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
ఈ కేసులో ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చారు. నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.