తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో భారీ స్కాం

 తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో భారీ స్కాం

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో భారీ స్కాము వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వ హాయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్న పశు సంవర్ధక శాఖలో గొర్రెలపంపిణీ కార్యక్రమంలో స్కాము జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.

ఈ కేసులో మాజీమంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ,సీఈ రామచంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఈ విచారణలో ఏడు వందల కోట్ల స్కాం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అయితే లబ్ధిదారులకు గొర్రెలను పంచకుండా వారి పేరు మీదుగా ప్రైవేట్ వ్యక్తులకు నగదు బదిలీ జరిగింది అని ఏసీబీ గుర్తించింది.అంతేకాకుండా ఇప్పటికే పదిమందిని కూడా అరెస్ట్ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *