ఈనెల 23న కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు ఏర్పాట్లు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఈనెల 23వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు ..కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన వారి కాంపు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఈనెల 23వ తేదీన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మరియు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సమావేశానికి హాజరుకానున్నారని.. ఇదే సమావేశంలో ఏప్రిల్ 27వ తేదీన బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారు హాజరై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.
కావున నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు జివి రామకృష్ణారావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బి ఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్ , మరియు కరీంనగర్ మండల పార్టీ అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి , కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్ , కొత్తపెల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు , జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు మరియు పలువురు మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు,డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇంచార్జ్ లు, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.