కేటీఆర్ కే భయపడుతున్నావు. ఇక నీకు కేసీఆర్ అవసరమా ..?
వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గిరిజనులపై దాడికి నిరసనగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ ” మాజీ మంత్రి కేటీఆర్ నే తట్టుకోలేకపోతున్నావు.
నీకు ఇక కేసీఆర్ అవసరమా..?. మీరు ప్రసంగించిన యాబై నిమిషాల్లో నలబై ఎనిమిది సార్లు కేసీఆర్ నామస్మరణే చేశావు. కేసీఆర్ అంటే నీకు ఎందుకు అంత భయం.. కేటీఆర్ అంటే ఎందుకంతా భయం.. దమ్ముంటే ధర్నాకు అనుమతిచ్చి చూడాలి. ఇది ప్రజాపాలన కాదు. ప్రజానిర్భంద పాలన.. నిరంకుశపాలన అని ” హెద్దేవా చేశారు.