ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు.
గమ్మత్తేంటంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ‘ఒక్క పైసా’ కూడా ‘కేటీఆర్ గారి జేబుల్లోకి’ వెళ్లినట్టు నిరూపించలేకపోయారు. పాపం ఆరు నెలలు శ్రమించారు కదా! ప్రజలు మీకిచ్చిన విలువైన సమయాన్ని నీళ్లపాలు చేశారు.ఆ మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు ఛీఫ్ ఇంజినీరు బీ ఎల్ ఎన్ రెడ్డి ల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారు.మీరు చూపించగలిగిందంతా ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే. వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ వేసి నిజమేంటో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది.
సచివాలయంలో ఇలాంటి ప్రొసీజర్ వయోలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో రోజూ జరుగుతుంటాయి. అట్ల చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రజలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వయోలేషన్స్ను తరువాత కేబినెట్లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతీది వయోలేషన్ లాగానే కనిపిస్తుంది.
ఇందులో ఖర్చు పెట్టిన ₹55 కోట్లు రాష్ట్రానికి వందల కోట్ల రాబడి కోసమే పెట్టినం. మీకేమైనా అనుమానాలు ఉంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని #KTR అంటున్నా మొఖం చాటేసి పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారు.
అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే, అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే.ఎవరినడిగి మీరు ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దు చేసారు?.మీరు ముందు నిపుణుల కమిటీతో చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా?.మీ వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి గిపోయింది. అసలు ఈ ఫార్ములా-ఈ కేసులో రేవంత్ రెడ్డి A-1. కేటీఆర్ కాదు. ముమ్మాటికీ కాదు.ఇదే నిప్పులాంటి నిజం.దాచేస్తే దాగని సత్యం అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు..రిటైర్డ్ అడిషనల్ డీజీ అర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.