చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్

 చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిందే నేను.. తమ్మీ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు.. కాంగ్రెస్ పార్టీలో చేరుమని చెప్పింది నేను “అని అన్నారు..

దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడి “అవును సబితక్క రమ్మంటేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.. అక్క నేను పార్టీలో చేరితే నన్ను ఎంపీగా గెలిపించుకుంటా అని నాకు హామీ ఇచ్చింది.. నేను పార్టీ మారగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు.. సునీతక్క (నర్సాపూర్ బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యే )కోసం ఎన్నికల్లో పని చేసి రెండు కేసుల పాలయ్యను.. అప్పుడు నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను. అక్క కమిషన్ చైర్మన్ అయ్యారు..వెనక ఉన్న కొంతమంది అక్కల మాటలు వింటే మున్ముందు కేటీయార్ జూబ్లీ బస్టాండ్ దగ్గర అడుక్కోవడమే.. ఇటువైపు ఉండి అక్కలు ఈ పార్టీని ముంచారు.. ఇప్పుడు అటు పక్క ఉండి మిమ్మల్ని ఆగం చేస్తారు అని “అనుచిత వ్యాఖ్యలు చేశారు..

దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం గౌరవం లేదు.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. దీనికి కౌంటర్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు లేచి ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చారు.. పదేండ్లు అధికారాన్ని పలు పదవులను అనుభవించి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు..మోసానికి పర్యాద పదం మీరే అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి సీతక్క లేచి రెండో సారి అధికారంలోకి వచ్చాక మహిళలకు మంత్రి పదవి ఇవ్వని సీఎం కేసీఆర్. మీరా మహిళల గురించి మాట్లాడేది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు కాదనే ఉద్దేశ్యంతో మాట్లాడారు.. సభ వెలుపల మీడియా పాయింట్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశశ్వని రెడ్డి, రగమయి మట్టా మాట్లాడుతూ మహిళలు అంటే మా పార్టీకి.. మా ముఖ్యమంత్రి గార్కి గౌరవం.. పేరు పెట్టి ఎవర్ని అనలేదు కదా ఎందుకు అంత రియాక్ట్ అవ్వాలని సాటి మహిళా ఎమ్మెల్యేలను అన్నారనే ఆలోచనలేకుండా రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు..

సహజంగా పార్టీలు మారడం నేటి రాజకీయాల్లో మాములే.. కానీ అదేదో మేము మొదటి నుండి ఒకటే పార్టీలో ఉన్నట్లు మహిళలు అనే ఆలోచన లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనడం ఓ ముఖ్యమంత్రి.. మంత్రి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కరెక్ట్ కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారే.. మద్ధతుగా నిలిచిన ఎమ్మెల్యేలలో రగమయి తో సహా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినవారే.. అలాంటిది తాము మొదటి నుండి ఒకే పార్టీలో ఉన్నట్లు మహిళలను అవమానించేలా మాట్లాడటం రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు.. బయట సమాజానికి మంచిది అన్పించదు.. రాజకీయాల్లో నువ్వా నేనా అన్నట్లు ఉండాలి కానీ ఓ వర్గాన్ని ఇలా కించపరిచేలా మాట్లాడటం.. అవమానించేలా ప్రతి ప్రవర్తించడం వారి పతనానికే పరాకాష్ట..

ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో దివంగత సీఎం జయలలిత ను అవమానిస్తే తర్వాత ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం కరుణానిధి ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు..ఎక్కడదాకా ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత నిండు సభలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మదేవేందర్ రెడ్డి పై సభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే సభలో క్షమాపణ చెప్పిన కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇంట్లో కూర్చోబెట్టారు గద్వాల్ ఓటర్లు.రాజకియంలో అధికారంలోకి రావడానికి ఏమైనా అనొచ్చు.. ఏమైనా హామీలు ఇవ్వొచ్చు..

తీరా అధికారంలోకి వచ్చాక మర్యాదగా నడుచుకోవడం.. ఎదుటివారికి గౌరవం ఇవ్వడం చూస్కోవాలి. అందుకే సభలో అయిన బయట అయిన అధికార పార్టీ నేతలైన ప్రతిపక్ష పార్టీ నేతలైన మట్కాడే మాటలను.. ప్రవర్తించే తీరును ప్రజలంతా గమనించి సమయం వచ్చినప్పుడు తమ తీర్పును ఇస్తారని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది.. లేకపోతే రాజకీయంగా గుణపాఠం తప్పదు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *