అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు..ఈ బిల్లుపై చర్చలో భాగంగా మాజీ మంత్రి.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు.
తాము చేసిన పని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ మేము నోటిఫికేషన్లు ఇచ్చాము.. మేము పరీక్షలు నిర్వహించాము.. తీరా ఫలితాలు వెల్లడించే సమయానికి ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది.ఆ ఫలితాలను మేము అధికారంలో ఉన్న వాళ్లు అధికారంలో ఉన్న ఎవరూ అధికారంలో ఉన్న కానీ వెల్లడించాల్సిందే.
అయితే అదేదో కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చినట్లు.. పరీక్షలు నిర్వహించినట్లు గప్పాలు కొట్టుకుంటూ తామే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం ఎంత వరకు కరెక్టు.. నిజంగా దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం అయిన ఇచ్చామని నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని ” సవాల్ విసిరారు.