జగన్ జైలుకెళ్లడం ఖాయం
మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలు కు వెళ్లడం ఖాయం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని తప్పు లేదు.. చేయని కుంభకోణం లేదు..
ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది..
వైసీపీ నేతలు.. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి అని నిరసన చేయడం పెద్ద నాటకం .. దాడులపై ప్రభుత్వానికి ఆధారాలు ఇవ్వమంటే ఇంతవరకు జగన్ కు సమాధానం లేదు అని ఆయన ఆరోపించారు.