అసెంబ్లీలో మంత్రి ఐస్ క్రీమ్ కథ చెప్పిన హారీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని మరి రేఫ్ అటెంప్ట్ చేశారు.
ఇంతగా మన రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి.. ప్రజలు ఎలా సుఖంగా ఉండగలరు. అయితే ఓ మంత్రి రాత్రి పదకొండు గంటలకు తన కూతురు ఐస్ క్రీమ్ తిందామని అడిగితే అలా బయటకు వెళ్లారు అధ్యక్ష.. నగరం అంతటా తిరిగిన కానీ ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ షాపులు తెరిచిలేవు. అంతటా తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో ఓ ఐస్ క్రీమ్ బండి ఎదురుగా వస్తుంటే కారు ఆపి అక్కడ తీసుకుని సదరు మంత్రి ఆ బండి అతన్ని అడిగాడు ..
ఏమైంది పదకొండు కూడా దాటలేదు అప్పుడే షాపులన్నీ మూతపడ్డాయి అని అడిగారు. దీనికి సమాధానంగా ఆ బండి అతను మాట్లాడుతూ” పది గంటలకే షాపులన్నీ మూసివేయాలని పోలీసులు చెబుతున్నారు.. చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తున్నారు చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం అబద్ధమా.. అధ్యక్షా..? అని రాష్ట్రంలో ఉన్న శాంతిభద్రతల గురించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.